TDP JANASENA AllAINCE: చంద్రబాబు సభలో జనసేన జెండాలు.. బీజేపీకి కీలక నేతల రాంరాం?

TDP JANASENA AllAINCE:చంద్రబాబు పల్నాడు టూర్ లో సరికొత్త సీన్లు కనిపించాయి. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన జెండాలు దర్శనమిచ్చాయి. చంద్రబాబు పర్యటనతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. అయినా చంద్రబాబు పర్యటనలో జనసేన కార్యకర్తలు పాల్గొనడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందనే వార్తలకు బలం చేకూరుతోంది.

Written by - Srisailam | Last Updated : Oct 20, 2022, 01:01 PM IST
  • చంద్రబాబు ర్యాలీలో జనసేన జెండాలు
  • టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్టేనా?
  • ఏపీ బీజేపీలో పలువురు నేతల గుడ్ బై?
 TDP JANASENA AllAINCE: చంద్రబాబు సభలో జనసేన జెండాలు.. బీజేపీకి కీలక నేతల రాంరాం?

TDP JANASENA AllAINCE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు దాదాపుగా కుదిరిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పల్నాడు టూర్ లో సరికొత్త సీన్లు కనిపించాయి. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన జెండాలు దర్శనమిచ్చాయి. చంద్రబాబు పర్యటనతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. అయినా చంద్రబాబు పర్యటనలో జనసేన కార్యకర్తలు పాల్గొనడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందనే వార్తలకు బలం చేకూరుతోంది.

మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో అధికార వైసీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర జేఏసీ నిర్వహించిన గర్జన టెన్షన్ పుట్టించింది. అదే రోజు పవన్ కల్యాణ్ ర్యాలీ తీయడంతో విశాఖలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి జరగడం, జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత కాక రాజేసింది. జనసేన నేతలను విడిచిపెట్టేవరకు విశాఖను విడిచి వెళ్లనని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో పోలీసులకు సవాల్ గా మారింది. చివరకు ప్రత్యేక విమానంలో పవన్ ను విజయవాడ తరలించారు పోలీసులు. అక్కడే చంద్రాబాబు వచ్చి జనసేన చీఫ్ ను కలిసి మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్బంగా ఇద్దరు నేతలు ఫైరయ్యారు. ఈ ఘటనతో జనసేన, టీడీపీ పొత్తు కుదిరందనే వార్తలు వచ్చాయి. ఇద్దరు నేతల మధ్య పొత్తుపై చర్చలు జరిగాయని.. కొలిక్కి వచ్చాకే ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చారని తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు టూర్ లో జనసేన కార్యకర్తలు పాల్గొనడంతో రెండు పార్టీల మధ్య అలయన్స్ దాదాపుగా కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ టూర్ బీజేపీలో సెగలు రేపుతోంది. వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు బయటికి వచ్చి గళం వినిపిస్తున్నారు. పార్టీ చీఫ్ సోము వీర్రాజు టార్గెట్ గా సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. దీంతో కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ చెప్పబోతున్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీ పరిస్థితులపై కన్నా చేసిన కామెంట్లను కొందరు సీనియర్ నేతలు సమర్ధించారు. అటు ఏపీ రాజకీయ పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. సోము వీర్రాజుతో మాట్లాడిన పార్టీ పెద్దలు.. కన్నా లక్ష్మినారాయణ కామెంట్లపైనా స్పందించారు. కన్నాతో సీనియర్ నేతలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి రావాలని ఆయనను పిలిచారని సమాచారం. కన్నా ఎపిసోడ్ ఏపీ బీజేపీలో కలకలం రేపుతోంది.కన్నా బాటలోనే మరికొందరు నేతలు కమలం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారంటున్నారు.

2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే ఓకే లేదంటే.. తమ దారి తాము చూసుకుంటామని కొందరు నేతలు తేల్చి చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరగనుంది.. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. కన్నా లాంటి సీనియర్ నేతలను ఎలా బుజ్జగిస్తుందని అన్నది ఆసక్తిగా మారింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో బీజేపీ పెద్దల తర్వాతే ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశంతో ఏపీ పొలిటికల్ సీనే మారిపోయినట్లు కనిపిస్తోంది.

Read Also: Munugode Bypoll Symbol: మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రోడ్డు రోలర్ గుర్తుపై సీఈసీ సంచలనం

Read Also: Munugode Bypoll: నిద్రలేని రాత్రులు గడుపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News