Omicron Variant Alert: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ అంటూ ప్రజలలు హడలి పోయారు. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిందనుకున్న తరుణంలో కొత్త వేరియంట్లు మళ్లీ పడగవిప్పాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది. దీపావళి పండగ వేళ ఒమిక్రాన్ తాజా వేరియంట్ బీఎఫ్ 7తో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్ 7ను చైనాలోని మంగోలియా అటానమస్ రీజియన్‌లో కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మరో ముప్పు తప్పదేమోనని భయాందోళనలు మొదలయ్యాయి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాల్లో కూడా బీఎఫ్ 7 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
బీఏ 5.1.7, బీఎఫ్ 7 సబ్ వేరియంట్లు గుర్తించగా.. బీఎఫ్ 7తో ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ బీఎఫ్ 7ని వేరియంట్‌ను 'ఓమిక్రాన్ స్పాన్' అని కూడా అంటారు. ఇండియాలో కూడా ఈ వేరియంట్ కేసును గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో ఈ బీఎఫ్ 7 కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం అలసత్వం వహించినా.. ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. బీఎఫ్ 7 ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ప్రమాదమంటున్నారు.
ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాలు..
- ఎక్కువగా దగ్గు ఉండడం
- వినికిడి సమస్యలు
- ఛాతీలో నొప్పి రావడం
- వణుకు రావడం
- వాసన గుర్తించకపోవడం
దీపావళి పండుగ వేళ మాస్కులు లేకుండా ప్రయాణించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే కోవిడ్ కంటే ఒమిక్రాన్ బీఎఫ్ 7 కేసులు వేగంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: Cyclone Sitrang: దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. ఏపీకి ముప్పు ఉందా..?
Also Read: Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి