Covid 19 in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు ఇప్పటి వరకు లక్ష కన్నా ఎక్కువే నమోదు అయ్యాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రం ప్రభుత్వం కోవిడ్-19 ( Covid-19 ) ను నివారించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM Jagan ) సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 కేసుల సంఖ్యను తగ్గించి చూపేందుకు తాము ప్రయత్నించడం లేదు స్పష్టం చేశాడు జగన్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షల ( Corona Tests In AP ) విషయంలో ఏపి టాప్ ప్లేస్ లో ఉందన్నారు సీఎం జగన్. తాడెపల్లిలోని క్యాంప్ ఆఫీస్ ( Tadepalli Camp Office ) లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో జగన్ పలు విషయాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also : AP & Telangana: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు


కీలక అంశాలివే


  • ఏపిలో గత 24 గంటల్లో 6 వేల పాజిటీవ్ కేసులు నమోదు అయిన విషయాన్ని అధికారులు తెలిపినట్టు జగన్ వెల్లడించారు.

  • రాష్ట్ర ప్రభుత్వం రోజూ 50 వేల పరీక్షలు నిర్వహిస్తోంది అని.. దేశంలో కరోనా పరీక్షల్లో ఏపి టాప్ లో ఉందన్నారు.

  • ప్రతీ పది లక్షల మందికి 31 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు... ముఖ్యంగా కోవిడ్-19 క్లస్టర్ లో 90 శాతం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

  • హోమ్ ఐసోలేషన్ ( Home Isolation ) లోనే 85 శాతం మందికి కోవిడ్-19 నయం అయింది అన్నారు. దీని గురించి అవగాహన కార్యక్రమంతో పాటు ప్రచారం చేయమని అధికారులకు సూచించారు సీఎం జగన్.


Read This Story Also: Dhanush Birthday: సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ సందడి