AP & Telangana: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు

Telugu States : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ( Heavy Rains ) కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. అయితే మరికొన్ని రోజుల పాటు  విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది. 

Last Updated : Jul 28, 2020, 11:10 AM IST
AP & Telangana: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు

Telugu States : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. అయితే మరికొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో( Andhra Pradesh, Telangana) ఇవాళ, రేపు భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు ( Lightning and Thunderstorm ) కురుస్తాయిన అని వెల్లడించింది వాతావరణ శాఖ. దక్షిణ బంగాళఖాతం, మధ్య బంగాళాఖాతంలో ఈదురు గాలులు సుమారు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.

Read This Story Also : Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలల్లో భారీగా వర్షాపాతం ( Heavy Rain) నమోదు అవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైతులు విత్తనాలు వేసే అవకాశం కూడా లభించడం లేదు. పైగా కలుపు సమస్య రైతులకు పెను సవాళుగా మారింది.

Read This Story Also :Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

Trending News