CM Jagan: ఈనెల 27, 28 తేదీల్లో రాయలసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. రేపు(మంగళవారం)తిరుమల శ్రీవారి బ్రహ్మెత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈసందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈఏడాది బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈఏడాది కోవిడ్ అదుపులో ఉండటంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా చేపడుతున్నారు. ఇవాళ్టి నుంచి స్వామి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు అంకుర్పారణ జరిగింది. అనంతరం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈనెల 27న(మంగళవారం) సాయంత్రం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.


ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. 27న రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని..ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం జగన్.ఈనెల 28(బుధవారం) శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు.


ఉదయం 7.10 గంటలకు టీటీడీ కోసం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి ఓర్వకల్ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల చేరుకుంటారు. ఈసందర్భంగా రామ్‌ కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 28న మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం.


Also read:CM Jagan: అంగన్‌వాడీల నుంచే నాణ్యమైన విద్య..అధికారులకు సీఎం జగన్ ఆదేశం..!


Also read:IND vs AUS: అనారోగ్య సమస్య ఉన్నా..హైదరాబాద్‌ మ్యాచ్‌లో సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook