Ugadi Celebrations: అంతా ఉగాది వేడుకల్లో ఉన్నారు. శుభకృత్ నామ సంవత్సరాన తెలుగు రాష్ట్రాల్లో సందడే సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందడి కన్పిస్తోంది. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ముఖ్యమంత్రులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. శుభకృత్ నామ సంవత్సర పర్వదినాన ఘనంగా జరిగిన వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం చిన్నారులతో కలిసి అందర్నీ పలకరించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో అధికారికంగా ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉగాది పంచాంగ వేడుకల్లో , పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ప్రభుత్వం నిర్వహించిన ఈ అధికారిక కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. పేరుకు తగ్గట్టుగానే అన్నీ శుభాలే జరుగుతాయని సిద్ధాంతి జోస్యం చెప్పారు. ప్రజలంతా హాయిగా..చల్లగా ఉంటారని పథకాలతో ప్రజలకు చేరువవుతారని చెప్పారు. పంచాంగ కర్త సుబ్బరామ సోమయాజులును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానించారు. మరోవైపు ఇదే వేదికపై నుంచి సంక్షేమ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేకూరాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. 


Also read: Pawan Kalyan: కౌలు రైతులకు అండగా పవన్... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.