AP CM YS JAGAN: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఊహించినట్టే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లో సాధించిన వన్ సైడెడ్ విక్టరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విజయంపై ఆయన ఏమన్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు(Ap Zilla Parishad Election Results) వెలువడ్డాయి. అందరూ ఊహించినట్టే రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కొన్ని జిల్లాల్లో వన్ సైడెడ్ విక్టరీ కాగా, మరికొన్ని జిల్లాల్లో భారీ విజయం సాధించింది అధికార పార్టీ. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 


రాష్ట్ర ప్రజల చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి జగన్(Ap cm ys jagan) తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో లభించిన విజయం తనకు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అక్షరాలా 13 వేల 81 పంచాయితీల్లో 10 వేల 536 పంచాయితీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్ని ఎన్నుకున్నారన్నారు. 75 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో కూడా 74 మున్సిపాల్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) అభ్యర్ధులే గెలిచారన్నారు. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో 86 శాతం ఎంపీటీసీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో విజయం అందించారన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ చెక్కుచెదరని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేశామన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నించి విఫలమయ్యాయన్నారు. మరోవైపు మీడియా సంస్థలపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించాయన్నారు. ఇక ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఓటమిని సైతం అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రజలకు మంచి జరగకుండా ఏదో రూపంలో అడ్డుకుంటోందని మండిపడ్డారు. కోవిడ్ కారణంగా చూపించి కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయించాయన్నారు. రాష్ట్ర ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.


Also read: Heavy Rains Alert: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook