Ramadan Wishes: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు అందించిన వైఎస్ జగన్
Ramadan Wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
Ramadan Wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్(Ramadan). మహనీయుడైన మొహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ( Quraan) ఆవిర్భవించింది రంజాన్ నెలలోనే కావడంతో ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రంజాన్ నెల ప్రాముఖ్యత దృష్ట్యా ముస్లింలందరూ నెల రోజులపాటు నియమ నిష్ఠలతో కఠినమైన ఉపవాస వ్రతం ఆచరిస్తుంటారు. దివ్య ఖురాన్ అవతరించిన నెల కాబట్టే రంజాన్‌కు అంతటి ప్రాముఖ్యత పవిత్రత ఉంది. రంజాన్ నెల ఇవాళ్టి నుంచి అంటే ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమైన సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలందరికీ అల్లాహ్ దీవెనలు లభించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. రంజాన్ అంటే ఉపవాసదీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప దీక్ష అని ఆయన తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.
Also read: Ambati Rambabu: రాళ్ల దాడి పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా ఆడుతున్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook