Polavaram project : ప్రతిష్ఠాత్మక  ప్రాజెక్టు, ఏపీ జీవన రేఖ పోలవరంపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) విషయంలో గత కొద్దిరోజులుగా  వివిధ రకాల వార్తలు ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం తెలుగుదేశం పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం గానీ , మంత్రి గానీ వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys Rajasekhar reddy )ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామన్నారు. 


మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు ఆపకూడదనే తపన ఉందన్నారు. పోలవరం నిర్మాణంలో ఆర్అండ్ఆర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. 


మరోవైపు వరుసగా మూడోరోజు కూడా టీడీపీ ( TDP ) సభ్యులు సమావేశాలకు ( Ap Assembly ) అడ్డు తగిలారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతుండగా..ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ..వెల్ లోకి దూసుకెళ్లడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 9 మంది టీడీపీ సభ్యుల్ని ఒకరోజు పాటు  సస్పెండ్ చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు సహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. Also read: AP: అసెంబ్లీలో కీలకమైన 11 బిల్లులు..కరెంటు బిల్లులో ఏముంది ?