YSR Bima Scheme: ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల్లో కీలకమైంది వైఎస్ఆర్ బీమా పథకం(Ysr Bima Scheme). సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు చేశారు. జూలై 1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయనున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. 18-50 ఏళ్ల వయస్సులో ఉండి.. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే లక్ష రూపాయలు, 18-70 ఏళ్లున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే 5 లక్షల రూపాయలు సహాయం అందించాలని వైఎస్ జగన్(Ap cm ys jagan) ఆదేశించారు.


పథకంలో కొత్తగా చేసిన మార్పులతో జూలై 1 నుంచి అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై 1 లోగా క్లెయిమ్‌లు అన్నింటినీ పరిష్కరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలన్నారు. 
Also read: Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 11 నుంచి భారీ వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook