రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, హోదా ఇస్తే రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వచ్చేవని ఏడాది పాలన తర్వాత సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. హోదా వల్ల పన్ను మినహాయింపులు, జీఎస్టీ వంటి వాటిలో  రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేదన్నారు.  ఏపీలో 2 వేలకు చేరువలో డిశ్ఛార్జ్ కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘మన పాలన-మీ సూచన’ పేరుతో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నాలుగోరోజు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేనివి కేవలం ఏడాది పాలనలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసింది. ప్రత్యేక హోదా వచ్చింటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఏదో ఒకరోజు కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. కేంద్రంలో బీజేపీకి అధిక మెజార్టీ రాక పోయింటే ఒత్తిడి తీసుకొచ్చి హోదాను సాధించేవాళ్లం.   బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన


గత ప్రభుత్వం నాలుగేళ్లు బీజేపీతో దోస్తీ చేసినా హోదాను సాధించలేకపోయింది. భవిష్యత్తులో కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదాను సాధించి తీరతాం. టీడీపీ ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తరలివచ్చాయని ప్రచారం చేసింది తప్ప.. అందులో నిజం లేదు. బకాయిలు పెట్టిన టీడీపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు ఎలా వస్తాయిని’ ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రశ్నించారు. 


కంపెనీలకు వేల కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, అలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో అగ్రస్థానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వంటి కష్ట కాలంలో కూడా ఎంఎస్ఎంఈలకు రూ.968కోట్లు ఇచ్చేందుకు తమ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దాదాపు 1400 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ కార్యక్రమం మే 25 నుంచి మే 30 వరకూ జరగనుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి