Ysr Awards Funtion: విశిష్ట వ్యక్తులకు వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేసిన వైఎస్ జగన్
Ysr Awards Funtion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వివిధ విభాగాలు, వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి అవార్డుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించారు.
Ysr Awards Funtion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వివిధ విభాగాలు, వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి అవార్డుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించారు.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు(Ysr lifetime Achievement Awards), వైఎస్సార్ సాఫల్య పురస్కారాల కార్యక్రమం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత ఘనంగా జరిగింది. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగింది. వివిధ రంగాలు, విభాగాల్ల విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్(Ap cm ys jagan)మాట్లాడారు. నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని వైఎస్ జగన్ ప్రశంసించారు. కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసామాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం తన అదృష్టమన్నారు. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం(Ap Government) అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయని.. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతియేటా నవంబర్ 1న వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు 10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్‌మెంట్ అవార్డు పొందిన వారికి 5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మరోవైపు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్(Biswabhushan Harichandan) వైఎస్సార్ సేవల్ని కీర్తించారు. వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ గొప్ప వ్యక్తిగా నిలిచారని..వైఎస్సార్‌కు విద్య, వైద్యం, అంటే ఎంతో మక్కువ అని చెప్పారు. పేదల నాడి తెలిసిన డాక్టర్ వైఎస్సార్ కాబట్టే.. వారి కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్నారు.
Also read: Vishal on Puneeth Rajkumar: ఆ పిల్లల చదువు, సంరక్షణ భాద్యత నాదే అంటున్న విశాల్‌కు నెటిజన్ల ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి