Ys Jagan Review: కోవిడ్ మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కర్ప్యూ సడలింపుల్లో మరోసారి నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona pandemic) ఏపీలో తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో 3 శాతం కంటే తక్కువకు కేసులు చేరుకున్నా కోవిడ్ నియంత్రణ చర్యల్ని కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ ధరించకపోతే వంద రూపాయలు జరిమానా కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే దుకాణాలకు భారీ జరిమానాతో పాటు అవసరమైతే 2-3 రోజులు సంబంధిత దుకాణాల్ని మూసివేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫోటో తీసి పంపేందుకు వీలుగా ప్రత్యేక వాట్సప్ నెంబర్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు జరగాలని ప్రభుత్వం (Ap government)సూచించింది. ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించాలని..మాస్క్ ధారణ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. 


కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకే విధంగా కర్ఫ్యూ సడలింపులు(Curfew Relaxations) ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇకపై ఉదయం 6 గంటల్నించి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల్లోగా దుకాణాలన్నీ మూసివేయాలని..పది గంటల్నించి తిరిగి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ(Night Curfew) అమల్లో ఉండనుంది. 


Also read: AP Exams: ఏపీలో పదవ తరగతి విద్యార్ధులకు గ్రేడ్లు కేటాయింపు, ఎలాగంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook