Ys jagan review: అమరావతి ప్రాంత అభివృద్ధిపై వైఎస్ జగన్ సమీక్ష
Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యగా అమరావతి, విశాఖపట్నంలోని ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యగా అమరావతి, విశాఖపట్నంలోని ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాలుగా ఉన్న అమరావతి (Amaravati ), విశాఖపట్నం ( Visakhapatnam )లలో జరుగుతున్న నిర్మాణ పనులపై వైఎస్ జగన్ సమీక్ష ( Ys jagan review ) నిర్వహించారు. విశాఖపట్నం, ఏఎంఆర్‌డీఏ పరిధిలోని ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నది కరకట్ట రోడ్డును 4 లైన్లుగా విస్తరించే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) కు అధికారులు వివరాలు అందించారు. అమరావతి ప్రాంత అభివృద్ధి ( Amaravati Region development )కి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని..అనుబంధ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ నిర్మాణాల కోసం 150 కోట్ల ఖర్చవుతుందని అంచనా. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
ఇక విశాఖ ( Visakhapatnam ) సముద్రతీరంలో 13.9 ఎకరాల్లోని ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. గతంలో ఇదే భూమిని లూలూ గ్రూప్‌కు కారు చౌకగా 33 ఏళ్ల లీజుకే గత ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా విశాఖకు తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి 1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్‌బీసీసీ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook