AP High Court: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు వెలువడింది. సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలనే హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి రాజధాని, సీఆర్డీఏ చట్టంపై ఏపీ హైకోర్టులో తుది తీర్పు వెలువడింది. రాజధాని రైతులకు భారీ ఊరట కలిగేలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువడింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని..రైతులకు భూముల్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.


హైకోర్టు తీర్పు నేపధ్యంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో చర్చించారు. హైకోర్టు తీర్పు కాపీ వెలువడటంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి..తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. మాస్టర్ ప్లాన్ మార్చకూడదని, సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాలని, కార్యాలయాలు తరలించకూడదని కోర్టు ఆదేశించింది. తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తీర్పులోని ఏ అంశాలపై కోర్టును ఆశ్రయించాలనేది చర్చిస్తున్నారు. 


Also read: AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా, ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook