ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మరో  స్టీల్‌ప్లాంట్ ( Steel plant )‌  నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  కొత్త స్టీల్‌ప్లాంట్‌ను కడపలో నిర్మిచాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. దీనిపై సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాయలసీమ ( Rayalaseema ) లో ఖనిజాలు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా సిమెంట్,  స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణాలకు ఈ ప్రాంతం చాలా అనువైనది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ( Ap government ) కొత్తగా  స్టీల్‌ప్లాంట్‌ను కడప ( Kadapa ) లో నిర్మించాలని తలపెట్టింది. మరోవైపు కొప్పర్తిలో ఎలక్ట్రానికి మ్యాన్యుఫ్కాక్చరింగ్ క్లస్టర్ ( Electronic manufacturing cluster ) ను ఏర్పాటు చేయదలిచింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( cm ys jagan ) అధికార్లతో సమీక్షించారు. ముఖ్యంగా కొప్పర్తి ఎలక్ట్రానికి క్లస్టర్ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ  సమీక్షలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కడప  స్టీల్‌ప్లాంట్‌  నిర్మాణానికి 7 ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు వివరించారు.


స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై వివిధ కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి..పైనల్ గా ఓ కంపెనీను ఎంపిక చేయనున్నారు. దీనికోసం కనీసం 7 వారాల వ్యవధి పట్టనుంది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన 3-4 వారాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ కోరారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణ కోసం ప్రభుత్వ పరంగా చేయవల్సినవి ఉంటే నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. 


కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు కడప నగరానికి చేరువలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై కూడా సీఎం జగన్‌ సమీక్ష ( ap cm ys jagan review ) నిర్వహించారు. 3 వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు వివరించారు. ఈ పెట్టుబడుల్ని మరింతగా పెంచే అవకాశాలున్నాయన్నారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. Also read: YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్