Polavaram Project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలవరం  ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి..నిర్వాసితులతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు(Polavaram project) పనుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే, క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు హిల్‌వ్యూ పాయింట్ నుంచి స్వయంగా పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఆ తరువాత పోలవరం నిర్వాసితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను, పోలవరం పనుల ఫోటో గ్యాలరీని  ముఖ్యమంత్రి జగన్ తిలకించారు. నిర్దేశిత గడువులోగా పోలవరం పనుల్ని పూర్తి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాలపై అధికారులతో అక్కడికక్కడే సమీక్షించారు. 


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్(Ap cm ys jagan)..తొలిసారిగా 2019 జూన్‌లో పోలవరం పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరదను మళ్లించేలా స్పిల్‌వేను పూర్తి చేయడం, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌లు, నిర్వాసితులకు పునరావాసం, కాపర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్ఎఫ్‌ను చేపట్టి..వరద కాలంలో కూడా పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందింది. కుడి, ఎడమ కాలువలు, అనుసంధానం, డిస్ట్రిబ్యూటరీ పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధమైంది. గత ప్రభుత్వం ఎక్కువ ధరలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనుల్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఫలితంగా 838 కోట్లు ఆదా జరిగింది. 


Also read: Parliament Monsoon Sessions: విపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా, నోటీసు ఇచ్చిన వైసీపీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook