YS Jagan Target 2024: 2024 అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ జగన్ టార్గెట్ సిద్ధమైందా
YS Jagan Target 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటాయి. ప్రత్యర్ధి ఊహించేలోగా నిర్ణయమైపోతుంది. అందుకే భారీ మెజార్టీతో విజయ బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్ని ఇప్పట్నించే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
YS Jagan Target 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటాయి. ప్రత్యర్ధి ఊహించేలోగా నిర్ణయమైపోతుంది. అందుకే భారీ మెజార్టీతో విజయ బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్ని ఇప్పట్నించే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు( Ysr Congress Party) ఉన్న ఏకైక దిక్చూచి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతిమాట సంచలనమే. నిదానంగా ఉన్నట్టు కన్పిస్తూనే కీలక నిర్ణయాల్ని అతి వేగంగా తీసుకుంటుంటారు. అందుకే ప్రత్యర్ధులకు వైఎస్ జగన్ వైఖరి అంతుబట్టడం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మోగించిన భారీ విజయ శంఖారావం ఇప్పటికీ మోగుతూనే ఉంది. ఎన్నికలేవైనా కావచ్చు విజయం వైసీపీదే అనే దిశలో ఇప్పటి వరకూ పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశం కావచ్చు. మరికొన్ని నిర్ణయాలకు న్యాయస్థానాల్లో ఇబ్బందులు రావచ్చు గానీ అంతిమంగా ప్రజలైతే జగన్ తీసుకునే చాలా నిర్ణయాల్ని సమర్ధిస్తున్నారనేది 2019 తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో సాధించిన విజయమే ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నారు వైఎస్ జగన్. 2024 అసెంబ్లీ ఎన్నికల్ని ఇప్పట్నించే వైఎస్ జగన్ టార్గెట్(Ys Jagan Target 2024)చేసినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి ఏపీలో జరగనున్న కేబినెట్ మార్పులు రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జరగవచ్చని సమాచారం. మరొక్క ఏడాది ఆగితే..వచ్చేదంతా ఎన్నికల సమయమే అవుతుంది. అందుకే ఇప్పుడు జరిగే కేబినెట్ మార్పు..2024 ఎన్నికలకు ప్రిపరేషన్ కావాలనేది ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకూ మంత్రులుగా పనిచేసినవారికి రానున్న ఎన్నికల నేపధ్యంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు.
2019 మే నెలలో అధికారం చేపట్టినప్పుడే రెండున్నరేళ్ల అనంతరం మంత్రివర్గంలో మార్పులుంటాయని అప్పడే వైఎస్ జగన్(Ap cm ys jagan) ప్రకటించారు. దసరా తరువాత గానీ, దీపావళి నాటికి గానీ కొత్త మంత్రులు కొలువుదీరవచ్చు. దాదాపుగా అందర్నీ మార్చే అవకాశాలున్నాయి. ప్రాంతాలు, వర్గాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రివర్గం (Ap New Cabinet)కొలువుదీరనుంది. ఇప్పటి వరకూ మంత్రవర్గంలో పనిచేసినవారికి పార్లమెంటరీ జిల్లాల ప్రాతిపదికన బాథ్యతలు అప్పగించనున్నారు. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత వీరికే ఇవ్వనున్నారు. అటు ఎంపీల్ని గెలిపించే బాధ్యతను మాత్రం కొత్తగా వచ్చే మంత్రులకు అప్పగించవచ్చు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించేందుకు వైఎస్ జగన్ సూచనలు ఇప్పటికే జారీ చేశారు. పార్టీకు నష్టం కల్గించే చర్యల్ని సహించేది లేదన్నారు. మొత్తానికి 2024 ఎన్నికలకు వైఎస్ జగన్ ఇప్పట్నించే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్ధికి అందని ఎత్తులతో ముందుకు సాగుతున్నారు.
Also read: UNO On Gandhi Jayanti: మహాత్ముడిని గుర్తు చేసుకున్న ఐక్యరాజ్యసమితి, గాంధీ స్ఫూర్తి అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి