UNO On Gandhi Jayanti: మహాత్మా గాంధీ..కేవలం మనదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయుడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ప్రజలకు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రత్యేక సందేశమిచ్చారు.
అక్టోబర్ 2 మహాత్ముడి జయంతి(Gandhi Jayanti). జీవితమంత అహింసాయుత మార్గంలో నడవడమే కాకుండా అదే మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన జాతిపిత. యాధృఛ్ఛికంగా అక్టోబర్ 2వ తేదీ అంతర్జాతీయ అహింసా దినోత్సవం. గాంధీజీ కేవలం భారతీయులకే కాదు ప్రపంచంలో చాలా దేశాల ప్రజలకు ఆదర్శనీయుడిగా ఇప్పటికీ ఉన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి(UNO) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ మరోసారి గాంధీజీని గుర్తు చేసుకున్నారు.
మహాత్ముడి స్ఫూర్తితో కరోనా మహమ్మారిపై పోరాడాలని ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. గాంధీజీ (Gandhiji)ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచం అందిపుచ్చుకోవాలని కోరారు. ఒకరిపై మరొకరు యుద్ధం చేసుకోవడం మంచిది కాదని సూచించారు. అందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై(Corona Pandemic)మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగించాలని పిలుపునిచ్చారు. కరోనాను ఓడించడమే అందరి లక్ష్యం కావాలన్నారు. గాంధీజీ జయంతి నాడే అంతర్జాతీయ అహింసా దినోత్సవం కావడం యాధృఛ్ఛికం కాదన్నారు. గాంధీజీ పాటించిన అహింస, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం మాటలకు అందనివన్నారు. మానవాళి భవిష్యత్తుకు కచ్చితంగా చోదకశక్తులన్నారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజన రేఖలు ప్రపంచానికి ప్రస్తుతం పెద్ద సమస్యగా మారాయన్నారు.
Also read: Bhavanipur Bypoll: భవానీపూర్ ఉపఎన్నికల ఫలితాలు నేడే, తేలనున్న దీదీ భవితవ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి