Ys Jagan Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బిజీబిజీగా గడపనున్నారు. మే 3 వతేదీన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు అభివృద్ధి పనులతో పాటు కీలకమైన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 3వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భోగాపురం చేరుకుంటారు. అనంతరం 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శిస్తారు. అంతర్జాతీయ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్టు మిగులు పనుల శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. 


విజయనగరంలో పర్యటన ముగించుకుని మద్యాహ్నం 1.40 గంటలకు విశాఖపట్నం మధురవాడకు చేరుకుంటారు. మద్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం ఐటీ టెక్ పార్క్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి..పారిశ్రామికవేత్తలతో సమావేశమౌతారు. ఆ తరువాత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి వివాహం సందర్భంగా నూతన దంపతుల్ని ఆశీర్వదిస్తారు. చివరిగా తాడేపల్లి బయలుదేరి వెళతారు. 


Also read: Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం, రాత్రి నుంచి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook