Vahana Mitra Scheme: ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం అందించే వాహన మిత్ర చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా వాహనమిత్ర చెక్కులు పంపిణీ చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రారంభించిన పలు సంక్షేమ పథకాల్లో ఒకటి వాహన మిత్ర పథకం. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందుతోంది. వాహనాల నిర్వహణ, ఇన్సూరెన్స్ వంటి ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం ఏటా పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది అంటే 2022-23 సంవత్సరపు వాహన మిత్ర చెక్కులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా పంపిణీ జరగనుంది. 


వాహనమిత్ర చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది.ఈ నెల 15వ తేదీన అంటే రేపు విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్..వాహన మిత్ర చెక్కుల్ని పంపిణీ చేయనున్నారు. 2022-23 ఏడాదికి 2 లక్షల 61 వేల 516 మంది అర్హులైన డ్రైవర్లకు ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది. ఈ ఏడాదికి వాహన మిత్ర పథకం కింద...261.51 కోట్ల ప్రయోజనం లభించనుంది. ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. మొత్తం లబ్దిదారుల్లో 1 లక్షా 44 వేల 164 మంది బీసీలుంటే..63 వేల 594 మంది ఎస్సీలున్నారు. 10 వేల 472 మంది ఎస్టీలున్నారు. 


Also read: Godavari Floods: రేపు గోదావరి నదికి మూడవ ప్రమాద హెచ్చరిక, లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook