Ram Charan: వావ్.. 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్.. డార్లింగ్ ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసినట్లేనా..?

Ram charan cutout: ఫెమస్ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ ను విజయవాడలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. గేమ్ ఛేంజర్ మూవీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ దీన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
 

1 /6

మెగా ఫ్యామిలీకి మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తొంది. రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ ఛేంజర్ మూవీ.. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.

2 /6

ఈ క్రమంలో..ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ.. విజయవాడ బృందావన కాలనీలో భారీ కటౌట్ ను రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసినట్లు సమాచారం.

3 /6

 ఈ భారీ కటౌట్‌ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు.. చెన్నై నుంచి వచ్చిన వాళ్లు ప్రత్యేకంగా వారం పాటు కష్టపడి దీన్ని తయారు చేశారన్నారు. మరొవైపు డార్లింగ్ ప్రభాస్ కటౌట్ 230 అడుగుల కన్నా.. రామ్ చరణ్ కటౌట్ పెద్దదిగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. దీంతో డార్లింగ్ రికార్డును రామ్ చరణ్ కటౌట్ దాటేసినట్లు తెలుస్తొంది.  

4 /6

ఈ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో.. మెగా అభిమానులు భారీగా పాల్గొన్నట్లు తెలుస్తొంది.. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా గట్టి చర్యలు తీసుకున్నారు.  

5 /6

మరొవైపు గేమ్ ఛేంజర్ మూవీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించినట్లు తెలుస్తొంది.  అయితే.. జనవరి 4న ఏపిలో అత్యంత భారీ స్థాయిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి  పవర్ స్టార్ డిప్యూటీ సిఎమ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని వార్తలు విన్పిస్తున్నాయి.

6 /6

ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ కటౌట్ లకు సంబంధించిన పిక్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇది మెగా కుటుంబానికి లభించిన మరొ అరుదైన గౌరవమని అభిమానులు అంటున్నారు.