Ys jagan on Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్ పరంపై పునరాలోచన చేయాలి, ప్రధాని మోదీకు జగన్ లేఖ
Ys jagan on Vizag Steel: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు లేఖ రాశారు.
Ys jagan on Vizag Steel: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు లేఖ రాశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్నది విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ( Visakhapatnam steel plant ). హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం ( Central Government ) విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం ( Privatisation of Visakha steel plant ) చేసే నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించారు. నిర్ణయం వెనక్కి తీసకునేవరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ప్రధాని మోదీకు లేఖ ( Ys jagan letter to pm modi ) రాశారు. లేఖలో ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్పారంటే…
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ( Visakha steel factory ) లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలి. ప్లాంటును బలోపేతం చేసే మార్గాల్ని అణ్వేషించాలి. విశాఖ ఉక్కు ద్వారా దాదాపు 20 వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే..పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం వేదికగా ప్రజల పోరాటంతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది. నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002-2015 మధ్యకాలంలో వైజాగ్ స్టీల్ ( Vizag steel ) మంచి పనితీరు కూడా కనబర్చింది. ప్లాంటు పరిధిలో 19 వేల 7 వందల ఎకరాల విలువైన భూములున్నాయి. ఈ భూముల విలువే లక్ష కోట్ల వరకూ ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడం వల్ల ప్లాంటుకు కష్టాలొచ్చాయి.
Also read: Ap Sec issue: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు: మంత్రి పెద్దిరెడ్డి
స్టీల్ ప్లాంటుకు సొంతంగా గనులు ( Captive mines ) లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలవడం ద్వారా ప్లాంటును తిరిగి ప్రగతిబాటలో తీసుకెళ్లవచ్చు. 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి అవుతోంది. డిసెంబర్ 2020లో 2 వందల కోట్ల లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే..ప్లాంట్ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తుంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని 5 వేల 260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్ స్టీల్స్‌కు టన్నుకు అదనంగా 3 వేల 472 రూపాయల భారం పడుతంది. సెయిల్ ( SAIL )కు సొంతంగా గనులున్నాయి. దాదాపు 2 వందల ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలో సమాన స్థాయికి తీసుకెళ్లవచ్చని వైఎస్ జగన్ ( Ys jagan ) తెలిపారు.
Also read: Visakhapatnam steel plant: విశాఖ ఉక్కుకోసం రాజీనామాలు..గంటా శ్రీనివాసరావు తొలి రాజీనామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook