కరోనా వైరస్ పాజిటీవ్ కేసులంటూ ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆందోళన అక్కర్లేదని పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచించడం తెలిసిందే. ఇదే విషయంపై సీఎం జగన్ సోదరి, అపోల్ హాస్పిటల్‌లో సీనియర్ డాక్టర్ సునితా రెడ్డి స్పందించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల తెలపాలంటూ మీడియా ఆమెను సంప్రదించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సోకిన లక్షణాలున్నట్లుగా అనిపిస్తూ ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చినట్లయితే అలాంటి వారు పారాసిటమాల్ వేసుకోవాలని సూచించారు. ఒకవేళ వారికి  దగ్గు ఉంటే సంబంధిత మెడిసిన్ తీసుకోవాలని చెప్పారు. కరోనా లక్షణాలున్నట్లుగా అనిపించిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమైన అంశంగా.. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇతరులకు కచ్చితంగా దూరంగా ఉండాలని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని వివరించారు. Also Read: CBSE బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా 


ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటంలో భాగంగా కరోనా లక్షణాలు కనిపిస్తే దాదాపు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్నారు. ఆ సమయంలో కుటుంబసభ్యులను కలవకపోయినా, మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ టచ్‌లో ఉండే అవకాశాన్ని సూచించారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చేతుల్ని ఆల్కాహాల్ తయారిత శానిటై శుభ్రంగా కడుక్కుంటూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డా.సునీతా రెడ్డి వివరించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..