ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు
ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. తాజాగా ఇస్రో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ మొదటి వారం లోపు మూడు తుపాన్ల గండం ఉందని పేర్కొంది. నష్టాన్ని అంచానా పంటలను కాపాడుకోవాలని సూచించింది. హుదూద్ తుపాను సమయంలో కూడా ఇస్త్రో ఇలాగే హెచ్చరికలు జారీ చేసింది. ఇస్రో హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు జాగత్రలు తీసుకొని .. నష్ట్రాన్ని తగ్గించుకో గల్లింది. తాజా హెచ్చరికలతో ప్రభుత్వం మరో మారు అప్రమత్తమవుతోంది.
పంటలు కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు - చంద్రబాబు
తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పనులను సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పంటలు కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ కాఫర్ డ్యాం పనులు నవంబర్ నుంచి మొదలు పెడతామన్నారు. అలాగే పవర్ హౌస్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని వెల్లడించారు