YS Sharmila on AP Election Results: ఏపీ ఎన్నికల్లో ఓటమిపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. "రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది.." అని ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..  
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనంతో వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 11 సీట్లకే పరిమతమైంది. ఇక షర్మిల నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్.. ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తుడిచిపెట్టుకుపోగా.. షర్మిల అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో క్యాడర్‌లో కాస్త ఉత్సాహం వచ్చింది. అయితే ఎన్నికల్లో ఓట్లు సాధించడంలో పెద్దగా సఫలీకృతం కాలేకపోయారు.


కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ షర్మిల కూడా ఓటమిపాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి ఈ సీటుపై అందరికీ ఆసక్తి నెలకొంది. వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల సర్వశక్తులు ఒడ్డినా.. చివరికి మూడోస్థానానికే పరిమితమియ్యారు. ఓట్ల లెక్కింపులో కాసేపు గట్టి పోటీ ఇచ్చిన షర్మిల.. ఆ తరువాత క్రమంలో వెనుకంజ వేశారు. అవినాష్ రెడ్డికి  5,96,207 ఓట్లు సాధించగా.. రెండోస్థానంలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి భూపేష్ రెడ్డికి 5,30,305 ఓట్లు వచ్చాయి. వైఎస్ షర్మిలకు 1,35,737 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. అయితే అవినాష్ రెడ్డికి, కడప జిల్లాలో వైఎస్సార్సీపీకి మెజార్టీ తగ్గడంలో షర్మిల కీ రోల్ ప్లే చేశారు. ఆమె చాలా వరకు వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. 


Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter