Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. భారతీయ జనతా పార్టీ, జనసేనతో కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయ దుంధుబి మోగించారు. కూటమిగా 164 సీట్లతో సంచలనం సృష్టించారు. ఒక్క తెలుగు దేశం పార్టీకే 135 సీట్లు గెలుచుకుంది. మరోవైపు మిత్రపక్షాలైన జనసేన పోటీ చేసిన 21 సీట్లలో మొత్తం సీట్లను కైవసం చేసుకుంది. ఇంకోవైపు బీజేపీ కూడా 8 అసెంబ్లీ సీట్లలో విజయ దుందుభి మోగించింది. మరోవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 292 సీట్లకే పరమితమైంది. అందులో బీజేపీ కేవలం 240 సీట్లతో మ్యాజిక్ మార్క్ కు 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు.
1999 కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ కీలకమైన లోక్ సభ స్పీకర్ పదవిని తీసుకుంది. అప్పట్లో రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎంఎంటీస్, జాతీయ రహదారలు తీసుకురాగలిగారు. అవన్ని ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయి. 2014లో కూడా కేంద్రంలో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. అప్పట్లో కేంద్రంలో రెండు మంత్రి పదవులను తీసుకుంది. అశోక్ గజపతి రాజు సమయంలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి.
ఇక 2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో విభేదించి ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత 2024లో మళ్లీ చంద్రబాబు ఎన్డీయేలో చేరడం.. కేంద్రంలో బీజేపీ మెజారిటీ మార్క్ కు దగ్గరలో ఆగిపోవడం వంటివి కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. ఈ రకమైన పరిస్థితి 25 యేళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబుకు కలిసి రావడాన్ని ఆయన అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. ఈ తరహా రెండు సార్లు రావడం ఒక్క చంద్రబాబు విషయంలో జరిగిందనే చెప్పాలి. ఈ సందర్బంగా రాష్ట్రానికి మళ్లీ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వస్తుందా.. ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు అమరావతి నిర్మాణానికి నిధులు.. పోలవరం నిర్మాణం, రాష్ట్రానికి తగినన్ని కేంద్ర నిధులు రాబట్టానికి చంద్రబాబుకు మంచి అవకాశం దొరికిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి కేంద్రంలో సీట్లు తగ్గడం అనేది చంద్రబాబుకువరంగా మారిందనే చెప్పాలి.
Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook