AndhraPradesh: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( coronavirus ) మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ నమోదుకానన్నీ కేసులు, మరణాలు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నమోదుకావడంతో ప్రజల భయాందోళన మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,432 కరోనా కేసులు నమోదు కాగా.. 44మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని బుధవారం ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 35,451 కి చేరింది. అంతేకాకుండా ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 452 కి పెరిగింది. Also read: AP: కొత్త జిల్లాలకు రంగం సిద్ధం, కమిటీ ఏర్పాటు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో, కోవిడ్ సెంటర్‌లల్లో 16,621 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 18,378 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. Also read: Covid19: కాదంటే కఠిన చర్యలు: జగన్ వార్నింగ్


అయితే గత 24గంటల్లో మొత్తం 22,197మందికి పరీక్షలు జరిపినట్లు ఏపీ ప్రభుత్వం ( AP Govt ) తెలిపింది. తాజాగా నమోదైన 2,432 కేసుల్లో రాష్ట్రానికి సంబంధించిన 2,412 పాజిటివ్ కేసులు ఉండగా.. ఇతర ప్రాంతాల వారివి 20 కేసులు ఉన్నాయి. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12,17,963 శాంపిళ్లను పరీక్షించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి...


[[{"fid":"187655","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ap coronavirus bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల బులెటిన్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ap coronavirus bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల బులెటిన్"}},"link_text":false,"attributes":{"alt":"Ap coronavirus bulletin","title":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల బులెటిన్","class":"media-element file-default","data-delta":"1"}}]]