AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి
AP Corona Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
AP Corona Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కరోనా మహమ్మారి(Corona Pandemic)రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య పెరగకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 67 వేల 590 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..1539 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అటు 1140 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 79 వేల 504 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 12 మంది మరణించగా..ఇప్పటి వరకూ 13 వేల 778 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల 448 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. అటు మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 20 లక్షల 7 వేల 730కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 63 లక్షల 37 వేల 946 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు.
గత 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా 243 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 228, కృష్ణా జిల్లాలో 194, నెల్లూరులో 176, పశ్చిమ గోదావరి జిల్లాలో 163 మందికి కరోనా సోకింది.
Also read: Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook