Covid-19 In Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ లో నిన్న కరోనావైరస్ ( Coronavirus ) కేసులు భారీగా తగ్గగా.. నేడు గణనీయంగా కేసుల సంఖ్యపెరిగాయి. గడచిన 24 గంటల్లో దాదాపు 3000 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య విభాగం జారీ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా 2901 కోవిడ్-19 కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో మొత్తం కరోనాసోకిన వారి సంఖ్య 8,11,825 కు చేరుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | TTD Special Darshan: రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన తితిదే


జిల్లాల వారీగా..


ఏపీలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య తగ్గుతూ ఉండగా గత 24 గంటల్లో 19 మంది వైరస్ వల్ల మరణించారు. ఇందులో కడప నుంచి నలుగురు, చిత్తూరు నుంచి ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కర్నూలు, వైజాగ్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు మరణించారు.



Also Read | AUEET-AUCET 2020: ఆంధ్ర యూనివర్సిటీ  పీజీ కోర్సుల అడ్మిషన్స్ వివరాలు


భారీగా రికవరీ


మరోవైపు రికవరీ రేటు బాగా పెరగడంతో గడచిన 24 గంటల్లో కొత్తగా 4352 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనావైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,77,900కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,300 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 74,757 మందికి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 76,96,653కు చేరుకుంది. 




A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR