AP CS pressmeet on PRC : కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు.. ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడి
ap cs pressmeet ap cs sameer sharma clarifies on prc : ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలను నిలుపుదల చేయాలంటూ ఉద్యోగుల నిరసనలు చేపడుతోన్న నేపథ్యంలో.. ఏపీ సీఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా దెబ్బతో ఏపీ రెవెన్యూ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని సీఎస్ పేర్కొన్నారు.
ap cs pressmeet ap cs sameer sharma clarifies on ap employees prc : ఏపీ ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన పీఆర్సీ జీవోలపై (PRC GO's) ఉద్యోగులు (Employees) అసంతృప్తితో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఇక జీవోల (GO's) విషయంలో సమ్మెకు కూడా సిద్ధమంట ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల పీఆర్సీ, (AP Employees PRC) ఇతర అంశాలపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ (ap cs sameer sharma) ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌పై (Andhra Pradesh) కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించిందన్నారు. ఏపీకి రూ.62వేల కోట్ల రెవెన్యూ ఉందని తెలిపారు. కొవిడ్ (Covid) లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ (Andhra Pradesh Revenue) రూ.98 వేల కోట్లు ఉండేదన్నారు. అయితే కరోనా దెబ్బతో ఏపీ రెవెన్యూ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు.
గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉందని సీఎస్ పేర్కొన్నారు. ఏపీపై ఒమిక్రాన్ ప్రభావంతో.. రాష్ట్ర రెవెన్యూపై (State Revenue) తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. ఇక రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, సంక్షేమ పథకాలకు బడ్జెట్ (Budget) ఎలా కేటాయించాలనేది ప్రభుత్వం (Government) ఆలోచించుకోవాల్సి ఉంటుందని.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే గవర్నమెంట్ కర్తవ్యమని తెలిపారు.
ఏపీ బడ్జెట్‌లో (AP Budget) పీఆర్సీతో (PRC) పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక చాలా సవాళ్లు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఆర్థికంగా ఏపీ స్వరూపమే మారిపోయిందన్నారు. ఏపీ పరిస్థితులు దిగజారిపోయాయని సీఎస్ పేర్కొన్నారు.
Also Read : Sania Mirza Retirement: ఫ్యాన్స్ కు షాకిచ్చిన సానియా మీర్జా...ఆటకు గుడ్ బై..
సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించామని.. ఉద్యోగులు, (Employees) పింఛనర్లు అందరికీ ఏపీ ప్రభుత్వం న్యాయం చేసిందని సీఎస్ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని వివరించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, (Employees salaries) సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు సీఎస్. ఇక కొత్త పీఆర్సీతో (prc) ఎవరి జీతాలు తగ్గవని సీఎస్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచి పీఆర్సీ (prc) అని పేర్కొన్నారు.
Also Read : Stock Market today: అంతర్జాతీయ ప్రతికూలతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook