Stock Market today: స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలతో ముగిశాయి. నేటి సెషన్లో (బుధవారం) సూచీలు దాదాపు భారీగా (stocks closing bell) నష్టాలను మూటగట్టుకున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 656 పాయింట్లు తగ్గి 60,098 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 175 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగటం, కరోనా కేసుల ఆందోళనకలిగిస్తుండటం వంటివి.. మార్కెట్లపై ప్రతికూలతలు పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 60,870 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 59,949 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,129 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,884 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 8 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగతా 22 కంపెనీలు డీలా పడ్డాయి.
ఎస్బీఐ 1.83 శాతం, టాటా స్టీల్ 1.19 శాతం, మారుతీ 1.17 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.55 శాతం, టెక్ మహీంద్రా 0.51 శాతం లాభాలను గడించాయి.
ఇన్ఫోసిస్ 2.77 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.71 శాతం, హెచ్‌యూఎల్ 2.41 శాతం, నెస్లే ఇండియా 2.41 శాతం, బజాజ్ ఫినాన్స్ 2.28 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీ మాత్రమే స్వల్ప లాభాలను గడించింది.
షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్ సూచీలు నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు (Rupee Value today) బలపపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.
Also read: xiaomi mix 5, vivo nex 5: 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్
Also read: Google Pay Tips: ఈ టిప్స్ పాటిస్తే గూగుల్ పేలో భారీగా క్యాష్ బ్యాక్‌లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook