Ap Degree Admissions: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కళాశాల ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం(Corona Crisis) కారణంగా విద్యాసంస్థల అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. జూన్‌లో ప్రారంభం కావల్సిన అడ్మిషన్ల ప్రక్రియ 3 నెలలు ఆలస్యంగా సెప్టెంబర్‌లో ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానం ద్వారా డిగ్రీ కళాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కళాలల్లో వివిధ  కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రారంభం కానున్న అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్(Degree Online Admissions schedule) విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ షెడ్యుల్ విడుద చేశారు. మరోవైపు ఈ నెల 17,18 తేదీల్లో ఏపీఐసెట్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ 2021(APICET 2021) పరీక్షలు 17, 18 తేదీల్లో జరగనున్నాయని కన్వీనర్ ఆచార్య శశిభూషణ్ రావు తెలిపారు. రాష్ట్రంలోనూ అటు హైదరాబాద్‌లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్ధుల్ని లోపలకు అనుమతించేది లేదంటున్నారు. 


రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్


నోటిఫికేషన్                                సెప్టెంబర్ 16వ తేదీ
విద్యార్ధుల రిజిస్ట్రేషన్                సెప్టెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు                     23-26 వరకు
వెరిఫికేషన్                                  23-24 తేదీల్లో
సీట్ల కేటాయింపు                         29వ తేదీ
కళాశాలల్లో రిపోర్టింగ్                   సెప్టెంబర్ 30, అక్టోబర్ 1
తరగతులు ప్రారంభం                 అక్టోబర్ 1 నుంచి     


Also read: Social Media: కరోనాపై అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook