ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోలీసు యంత్రాంగం అన్ని విధాలా సిద్ధమవుతోంది. పటిష్టమైన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపబోతోంది. ప్రజల్ని చైతన్యం చేయబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ‌లో గత కొద్దికాలంగా హిందూ దేవాలయాల్ని ( Temple attacks ) టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది ఘటన మొదలుకుని..మొన్నటి రామతీర్ధం ( Ramatheertham incident ) వరకూ అనుమానాస్పద రీతిలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపధ్యంలో ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలకమైన సమావేశం నిర్వహించారు.


దేవాలయాలపై దాడులు ( Attack on Temples ), కేసుల ఛేదన, అరెస్టులు వంటి అంశాలపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( Ap Dgp Gautam sawang ) జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో వెబినార్‌ నిర్వహించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి కుట్రలు భగ్నం చేయాలని..దీనికోసం విలేజ్ కమిటీ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఆలయాల పరిరక్షణకు ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్దేశాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని..ఎంతటివారైనా వదలకూడదని ఆదేశించారు. ఆధారాలతో సహా నిందితుల్ని పట్టుకుని..దాడులపై వాస్తవాల్ని ప్రజలు తెలియజేయాలని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదలొద్దని తెలిపారు. ఆధారాలతో సహా నిందితులను  పట్టుకోవాలని, దాడులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు.


Also read: AP: కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన వైఎస్ జగన్..రాష్ట్ర అంశాలపై చర్చ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook