కరోనా కొత్త రకం వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమైన కరోనా కొత్త రకం వైరస్ ( New coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వాలు ఎదుర్కొనేందుకు సన్నద్ధమౌతున్నాయి. ఏపీ ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అటు రాష్ట్ర పోలీసు శాఖ కూడా అప్రమత్తంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gowtham Sawang ) ప్రకటించారు. 


వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ ( DGP ) తెలిపారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా వైద్యశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు. 


పోలీసు స్టేషన‍్లతో పాటు లాకప్‌లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చలికాలం నేపధ్యంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


Also read: AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం..తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు