ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి శుభవార్త వెలువడింది.  డీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో  ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది.  డీఎస్సీ ద్వారా ఏపీలో మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసింది. 2018 జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు కూడా ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్‌ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అధికారిక సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయమై ఈ రోజే సచివాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అధికారిక నోటిఫికేషన్ డిసెంబరు 15న విడుదల అవుతుంది. ప్రకటనలోని అంశాల ప్రకారం మార్చి 23,24,26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. హాల్‌ టిక్కెట్లను వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 10,313 స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్‌ పండిట్స్ ఉద్యోగాలతో పాటు.. తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, వికలాంగ, అంధ విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.