Andhra Pradesh Assembly Election 2024: ఏపీలో ఎన్నికల నామినేషన్ల జోరు ఊపందుకుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ సందడి చేస్తున్నారు. వీరు అఫిడవిట్‌లో  పేర్కొంటున్న ఆస్తులు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. కొందరు లక్షల్లో ఆస్తులు చూపిస్తుంటే.. మరికొందరు వందలకోట్లలో ఆస్తులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల పోరు యమరంజుగా సాగే అవకాశం ఉంది. అయితే తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్క కంపెనీ విలువే అన్ని కోట్లా..
ఎన్నికల అఫిడవిట్‌లో మాదవి తన ఆస్తులు విలువ రూ.894.92 కోట్లగా పేర్కొంది. వీటిలో మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్‌ వంటివి ఉన్నాయి. బ్యాంకు ఖాతాలో రూ.4.42 కోట్లు, నగదు రూపంలో రూ.1.15 లక్షలు ఉన్నట్లు చూపించిన ఆమె.. చర ఆస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లుగా పేర్కొన్నారు. ఇక అప్పులు అయితే రూ.2.69 కోట్లు ఉన్నట్లు చూపించారు. 


రెండున్నర రెట్లు పెరిగిన బొత్స ఆస్తి..
మరోవైపు అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న వైసీపీ అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన ఆస్తులు వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తి ఈ ఐదేళ్లలో దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. మంత్రి బొత్స తన ఆస్తిని రూ. 21.19 కోట్లుగా చూపించారు. గత ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం, ఆయన ఆస్తి రూ.8.23 కోట్లు మాత్రమే. ఈసారి అఫిడవిట్‌లో బొత్స తన పేరిట చరాస్తులు రూ.3.78 కోట్లుగా, ఆయన భార్య ఝాన్సీలక్ష్మి పేరు మీద రూ.4.75 కోట్లు, హెచ్‌యూఎఫ్‌ కింద రూ.35.04 లక్షలు చూపించారు. స్థిరాస్తుల పరంగా మంత్రి గారి పేరు మీద  రూ.6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో రూ.4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ.1.08 కోట్ల ఉన్నాయి. అప్పులు రూ.4.24 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వీరిపై ఎలాంటి కేసులు లేవు. 


Also Read: Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?


Also Read: Vijayawada Central: విజయవాడ సెంట్రల్ టికెట్‌లో మార్పు, వంగవీటి రాధాకు అవకాశమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook