Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?

Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు ఇచ్చారు.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 19, 2024, 07:16 PM IST
Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?

Nandamuri Balakrishna Nomination:  నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ వేశారు. వారి వెంటే టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా హజరయ్యాయి. హ్యాట్రికే లక్ష్యంగా మూడోసారి కూడా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగనున్నారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి బాలయ్య గెలుపొందారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశంకు కంచికోట అన్న సంగతి తెలిసిందే. మూడోసారి గెలుపుపై బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశాడు. 

వసుంధర, మోక్షజ్ఞ ఆస్తులు ఎంతో తెలుసా?
నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించాడు బాలయ్య. ఇందులో ఈ సిని హీరో తన ఆస్తుల, అప్పుల వివరాలను పొందుపరిచాడు. దీని ప్రకారం, బాలయ్య ఆస్తుల విలువ 81 కోట్ల 63 లక్షలు. ఆయన సతీమణి నందమూరి వసుంధర ఆస్తుల విలువ 140 కోట్ల 38 లక్షల 83 వేలుగా పేర్కొన్నారు. కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలుగా చూపించారు. తనకు 9 కోట్ల 9 లక్షల 22 వేలు అప్పులున్నట్లు బాలయ్య తన అఫిడవిట్ లో చూపించాడు. తన భార్య వసుంధరకు 3 కోట్ల 83 లక్షల 98 వేలు అప్పులున్నట్లు చూపించారు.  

Also Read: Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?

విజయంపై బాలయ్య ధీమా..
తన తండ్రి ఎన్టీఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తానని బాలయ్య అన్నాడు.  ఇప్పటికే హిందూపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశామని.. అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు వేశామని ఆయన అన్నారు. జగన్ సర్కార్ అన్న క్యాంటీన్లు తొలగించినా.. ఇప్పటికీ హిందూపరంలో రోజుకి 400 మందికి భోజనాలు పెడుతున్నామని ఈ సందర్భంగా బాలయ్య అన్నాడు. మూడోసారి కూడా తనను గెలిపించాలని బాలయ్య ప్రజలను కోరారు. 

Also Read: Nomination Rules: నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News