Ap Assembly live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే  ఘర్షణకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిపై అధికార పార్టీ మండిపడుతోంది. తాజాగా స్పీకర్‌ను చంద్రబాబు బెదిరించారా..అసలేం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) అసెంబ్లీ సమావేశాలు ( Assembly session ) రెండో రోజుకు చేరుకున్నాయి. శీతాకాల సమావేశాల్ని ఐదు రోజుల పాటు జరగనున్నాయి. స్పీకర్ పోడియంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ( Chandrababu naidu ) బైఠాయించడం, మార్షల్స్ తీసుకెళ్లడం వంటి ఘటనలో తొలిరోజు సమావేశాలు రక్తి కట్టాయి. రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై అధికార పార్టీ మండిపడుతోంది. దీనికి కారణం సాక్షాత్తూ స్పీకర్‌నే చంద్రబాబు బెదిరించడం.


అసలు చంద్రబాబు నాయుడు నిజంగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ( Speaker Tammineni Sitaram )ను బెదిరించారా..అసలేం జరిగిందో పరిశీలిద్దాం. రెండోరోజు సమావేశాల్లో  ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సహజ పద్ధతి కాస్త ఆవేశాన్ని జోడించి మాట్లాడారు. స్పీకర్ తమ్మినేని సీతారాం వైపు వెేలు చూపిస్తూ..మీ సంగతి చూస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. చేతిలో పేపర్లను స్పీకర్ వైపు విసిరేశారు. ఈ ఘటనను స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు. సభాధ్యక్షుడినే బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని..మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని హితవు పలికారు., 


ఈ ఘటన రెండో రోజు సమావేశాల్లో వివాదానికి దారితీసింది. స్పీకర్ పట్ల చంద్రబాబు వైఖరి, చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌కు చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలు  రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు ( Chandrababu )లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని..విమర్శించారు. Also read: AP: జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలా...సుప్రీంకోర్టు ఇలా చెప్పిందా