Ap ex cm ys jagan interesting comments on assembly results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఒకవైపు అధికార వైసీపీ పార్టీ వైనాట్ 175 అంటూ బరిలోకి దిగారు. మరోవైపు ఏపీలో ఈ సారి గెలుపే టార్గెట్ గా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బరిలోకి దిగాయి. అంతేకాకుండా..ప్రచారం మొదలు కొని ప్రతివిషయంలో కూడా కూటమినేతలు ఎంతో స్ట్రాటజీగా ముందుకు వెళ్లారు. ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా.. ఒకరి పట్ల మరోకరు గౌరవంతో, అధికారం సాధించే దిశగా ప్రజల్లోకి వెళ్లారు. ఒక వైపు కూటమి అధికారంలోకి వస్తే అందిచే సంక్షేమ పథకాలు గురించి ప్రచారం చేస్తూనే మరోవైపు జగన్ అక్రమాలను కూడా ప్రజల్లో ఎండగట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..


గత వైసీపీ పాలనలో ఏపీ డెవలప్ మెంట్ ఎక్కడ లేదని, కేవలం ప్రతీకార రాజకీయాలు చేసిందని కూటమి నేతలు ప్రజల్లో తీసుకెళ్లడంతో సక్సెస్ సాధించారు. ఒకవైపు వైసీపీ మంత్రులు, నేతల నోటి దురుసుతనం వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మరోవైపు.. ఒక మాజీ సీఎం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని స్కిల్ కేసులో జైలులో ఉంచడం కూడా జగన్ సర్కారు కు ప్రజల్లో నెగెటివ్ ఇంపాక్ట్ కల్గజేసింది. మరోవైపు జగన్ కు సొంత చెల్లెళ్లే చుక్కలు చూపించారు. బాబాయ్ హత్య కేసువిషయంలో ఎన్నికల ముందు ఆయనకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసింది.


సొంత వాళ్లకు న్యాయం చేయలేని జగన్ ఇంకా.. ప్రజలకు ఏంచేస్తాడని షర్మిల ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లగలిగారు. ఇక ఏపీకి స్పెషల్ స్టేటస్, పోలవరం,  జాబ్ ల ప్రకటన లేకపోవడం, మూడు రాజధానుల అంశం, లిక్కర్.. ఇలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నవిధంగా.. ఏపీలో వైసీపీ బొక్కా బొర్లా పడింది. ఈ నేపథ్యంలో కూటమి అనుహ్యంగా విజయం సాధించింది. గతంలో వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యేలా చేశారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు చూసి వైసీపీ నాయకుడు జగన్ షాక్ లో ఉండిపోయారంట. ఆయన రిజల్ట్ తర్వాత కూడా ప్రెస్ మీట్ లో చాలా ఒత్తిడికి గురయ్యారు.


ఇన్ని పథకాలు, ప్రజలకు నవరత్నాల వంటి అనేక పథకాలు ఇచ్చిన కూడా ఎలా ఓడిపోయామో అర్థం కావట్లేదన్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన మంత్రి వర్గం, మాజీ ఎమ్మెల్యేలతో ఇటీవల ఓటమి తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారంట.ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఏపీ ఎన్నికల తర్వాత .. హిమాలయాలకు పోవాలనిపించిందని వైఎస్ జగన్ కామెంట్లు చేశారంట. తనకు ఇలా ఉంటే.. ఒక అసెంబ్లీ పరిధిలో, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంకెంత ఒత్తిడి ఉంటుందో తాను అర్థం చేసుకొగలనని జగన్ అన్నారంట.


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


కానీ 40 శాతం  ఓట్లు రావడంతో ప్రజలు తమపై కొంత నమ్మకం పెట్టుకున్నారని,  అందుకే మరల ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారంట. వైసీపీ జగన్ కు రిజల్ట్ షాక్ నుంచి కోలుకోవడానికి మూడు రోజులు పట్టిందని ఆయన అన్నారంట. కానీ అన్నింటి నుంచి మెల్లగా బైటకొచ్చి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారంట. అందుకే నియోజకవర్గాలలో తిరిగి వైసీపీ నేతలు వెళ్లాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ మరోసారి నేతలకు దిశానిర్దేషం చేశారంట. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి