అమరావతి: టీడీపీ ( TDP ) అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పేరుతో ఐటీ విభాగం సలహాదారుగా కొనసాగిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (APSFL) బిజినెస్, ఆపరేషన్స్‌ విభాగం మాజీ ఈడీ గౌరీశంకర్‌ ( Gouri Shankar ) ఆరోపించారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో నియమించుకుని భారీ అక్రమాలకు మార్గం సుగుమం చేసుకున్నారని.. ఇప్పటికీ అక్కడ ఆయన మనుషులే చక్రం తిప్పుతున్నారని గౌరీశంకర్ అన్నారు. ఈ అక్రమాలను బట్టబయలు చేసినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని.. ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ లేదా పోలీసులతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌కు గౌరిశంకర్ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు ఆయన ఓ లేఖ రాశారు. Also read : AP Judiciary: హైకోర్టుకు..ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న అంతరం, ఎంపీల విమర్శలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఫైబర్‌ గ్రిడ్‌లో ( AP fiber grid ) జరిగిన అక్రమాలను మరోమారు బహిర్గతం చేసేందుకు యత్నించిన గౌరిశంకర్... దీనిపై వేమూరి హరికృష్ణ ప్రసాద్ ( Vemuri Harikrishna Prasad ) బహిరంగ చర్చకు  సిద్ధమా ? అని సవాల్‌ విసిరారు. సెట్‌ టాప్‌ బాక్సుల ( Set top boxes ) కొనుగోళ్ల నుంచి మొదలుకుని ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ ( Fiber grid connections ) బిల్లుల వరకు అంతటా అవినీతి జరిగిందని అన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ( Fiber grid project ) పేరుతో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారన్న గౌరీ శంకర్.. రూ.1,500 కోట్ల బిల్లులను చెల్లించగా.. అందులో 80 శాతం నిధులు వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరాసాఫ్ట్, నెటాప్స్‌, నెట్‌ఇండియా వంటి సంస్థల ఖాతాల్లోకే వెళ్లాయని తెలిపారు.  


కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకోవడం నుంచి బిల్లుల చెల్లింపు వరకు అంతా అక్రమమేనని.. వారికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా తనని బెదిరించారని గౌరి శంకర్ మీడియాకు వెల్లడించారు. తాను చేస్తోన్న ఆరోపణలు నిజం కాదని భావిస్తే.. బహిరంగ చర్చకు రావాలని వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కి గౌరీ శంకర్ సవాల్ చేశారు. Also read : AP: తాజాగా 8,096 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే?