Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్ననే 6లక్షలు దాటిన సంగతి తెలిసిందే. దీంతోపాటు నమూనాల సంఖ్య 50లక్షలకు చేరువలో ఉంది. తాజాగా.. గత 24గంటల్లో ( గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు ) 74,710 శాంపిళ్లను పరీక్షించగా.. 8,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 67 మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,09,558 కి పెరగగా.. ఇప్పటివరకు 5,244 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Nishabdham Movie: ఓటీటీలోనే స్వీటీ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 84,423 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 5,19,891 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 49,59,081 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..
Also read: Apple: యాపిల్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో త్వరలోనే స్టోర్ ప్రారంభం