AP Government: కేన్సర్ మహమ్మారి నుంచి సంరక్షణ కల్పించే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ విఖ్యాత కేన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడిగా నియమించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వైద్యరంగానికి సంబంధించి కేన్సర్ మహమ్మారి(Cancer)నియంత్రణకు, కేన్సర్ నుంచి రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ విఖ్యాత ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడిని సమగ్ర కేన్సర్ సంరక్షణ విభాగంలో ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. కేబినెట్ హోదాలో రెండేళ్ల పదవీకాలంతో ప్రభుత్వ సలహాదారుడిగా ప్రభుత్వం నోరి దత్తాత్రేయుడిని నియమించింది. కేన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రెండ్రోజులక్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో(Ap cm ys jagan) కలిసి సుదీర్ఘంగా చర్చించారు. 


రేడియేషన్ ఆంకాలజీలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి(Dr Nori Dattatreyudu)43 ఏళ్ల అనుభవముంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలాజిక్ ఆంకాలజీ, హెడ్, నెక్, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్ ప్రోగ్రామ్ కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కీలకపాత్ర పోషించారు. న్యూయార్క్ హాస్పటల్ క్వీన్స్‌లో అంకాలజీ ప్రతి స్పెషాలిటీలో ట్యూమర్ కాన్ఫరెన్స్‌లను ప్రారంభించారు. వైద్యరంగంలో డాక్టర్ నోరి దత్రాత్రేయుడు చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది. డాక్టర్ నోరి దత్రాత్రేయుడిని సమగ్ర కేన్సర్ సంరక్షణ విభాగంలో ప్రభుత్వ సలహాదారుడిగా( Ap government Advisor) నియమించడం నిజంగానే ఓ మంచి పరిణామం. 


Also read: CJI NV Ramana: టీటీడీలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు - సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి