AP: మూడు రాజధానులపై హైకోర్టులో ప్రభుత్వ వాదన నేటి నుంచి
AP: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ్టి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు విన్పించనున్నారు.
AP: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు విన్పించనున్నారు.
ఏపీకు మూడు రాజధానులు ( Ap Three capitals ) నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చిన హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఇప్పటివరకూ పిటీషనర్ల వాదనను విని రికార్డు చేసిన కోర్టు ఇవాళ్టి నుంచి ప్రభుత్వ వాదనలు విననుంది. హైకోర్టు ( High court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపడుతోంది.
వాస్తవానికి సోమవారమే దీనిపై విచారణ ప్రారంభం కావల్సి ఉన్నా..ప్రభుత్వం తరపున వాదన విన్పించేందుకు ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం రానున్నారని విన్నవించడంతో కోర్టు అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు ( Supreme court ) బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దుష్యంత్ దవే ( Dushyant Dawe ) రాకతో విచారణలో ఉత్కంఠత పెరిగింది. మూడు రాజధానుల ఏర్పాటు ఏ విధంగానూ సమంజసం కాదని పిటీషనర్లు వాదించారు.
మరోవైపు పరిపాలనా వికేంద్రీకరణ చట్టం ప్రకారం అభివృద్ది చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని మరో న్యాయవాది వేసిన పిటీషన్ పై స్పందించిన కోర్టు..ఇతర కేసుల విచారణ సందర్బంగా పరిశీలిస్తామని చెప్పింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే ..మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం తరపున వాదనలు విన్పించనున్నారు. Also read: AP High court: జ్యుడీషియల్ రివ్యూకు..ప్రివ్యూకు తేడా తెలుసుకోకపోతే ఎలా