/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

AP High court: జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని ఏపీ హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై విచారణ సందర్బంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని వైఎస్ జగన్ ప్రభుత్వం ( ys jagan government ) దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని రూపకల్పన చేసింది. అంటే టెండర్లను ఖరారు చేసేముందు ప్రభుత్వంచే నియమించిన జ్యుడీషియల్ కమిటీ ప్రివ్యూ ( Judicial preview ) చేసి నిర్ధారిస్తుంది. కమిటీ ప్రివ్యూ పొందితేనే టెండర్లు ఆమోదం పొందుతాయి.

ఈ చట్టాన్ని ప్రశ్నిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని తిరుపతికి చెందిన విద్యాసాగర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ( Ap High court ) విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాధమికంగా ఈ చట్టాన్ని సమర్ధించింది. అసలీ చట్టంలో తప్పేముందని ప్రశ్నించింది. జ్యుడీషియల్ ప్రివ్యూకు, రివ్యూకు తేడా తెలుసుకోకుండా పిటీషన్ దాఖలు చేసినట్టుందని కోర్టు వ్యాఖ్యానించింది. లేదా గతంలో ఇలాంటి తీర్పులేమైనా ఉంటే వాటిని సమర్పించాలని పిటీషనర్ ను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే..పిటీషన్ కొట్టివేసి కోర్టు ఖర్చుల్ని చెల్లింపజేస్తామంది. 

రాజ్యాంగంలో జ్యుడీషియల్ రివ్యూ ( Judicial review ) గురించి తప్ప..ప్రివ్యూ గురించి లేదని పిటీషనర్ వాదించగా..కోర్టు ఈ వ్యాఖ్యలతో విభేదించింది. విచారణను పదిరోజులకు వాయిదా వేసింది. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ దొనాడి రమేశ్ లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. Also read: AP: నిమ్మగడ్డ ఒక పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నట్టే ఉంది

Section: 
English Title: 
Ap High court comments on judicial preview act on tenders
News Source: 
Home Title: 

AP High court: జ్యుడీషియల్ రివ్యూకు..ప్రివ్యూకు తేడా తెలుసుకోకపోతే ఎలా

AP High court: జ్యుడీషియల్ రివ్యూకు..ప్రివ్యూకు తేడా తెలుసుకోకపోతే ఎలా
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, పిటీషన్ పై విచారణ

జ్యుడీషియల్ ప్రివ్యూకు. రివ్యూకు తేడా తెలుసుకోకుండా పిటీషన్ వేశారా అని ప్రశ్న

జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టంలో తప్పేముందని ప్రశ్నించిన హైకోర్టు

Mobile Title: 
AP High court: జ్యుడీషియల్ రివ్యూకు..ప్రివ్యూకు తేడా తెలుసుకోకపోతే ఎలా
Publish Later: 
No
Publish At: 
Tuesday, December 8, 2020 - 08:23
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
97