Special Vaccination: ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్‌కు అంకితమై ఉంటోంది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఇంటర్మీడియ్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో విద్యాశాఖకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం కావాలంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా పరిస్థితుల్లో విద్యాసంవత్సరం 2020 మార్చ్ నుంచి తీవ్రంగా నష్టపోతోంది. 2021 విద్యా సంవత్సరంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలనేది ఏపీ ప్రభుత్వ(Ap government) ఆలోచనగా ఉంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్ని కేంద్ర ప్రభుత్వం(Central government) తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంగా 12వ తరగతి పరీక్షల నిర్వహణపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు(Ramesh pokhriyal) లేఖ రాశారు. కోవిడ్ నిబంధల్ని పాటిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షల్ని నిర్వహించాలని సూచించారు. 


అదే సమయంలో కొన్ని కీలక విషయాల్ని ప్రస్తావించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షల్ని నిర్వహించాల్సి ఉన్నందున..ప్రత్యేక కోటాలో వ్యాక్సిన్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. టీచర్లు, ఇన్విజిలేటర్లు, ప్రొఫెసర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని కోరారు. వ్యాక్సిన్ వేస్తే ఉపాధ్యాయులు, లెక్చరర్లలో మానసిక స్థైర్యం పెరుగుతుందని..కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల్ని పరిగణలో తీసుకుని వ్యాక్సిన్ కోటా ప్రత్యేకంగా కేటాయించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ( Adimulapu Suresh) విజ్ఞప్తి చేశారు. 


Also read: AP Covid Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 12 వేల కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook