SSC Inter Tatkal Fee: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యుల్ వచ్చేసింది. రెండింటి పరీక్షలు మార్చ్ నెలలో జరగనున్నాయి. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించే గడువు ముగిసింది. అయితే వివిధ కారణాలతో ఇంకా ఫీజు చెల్లించనివారికై ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇస్తోంది. ఈ మేరకు తత్కాల్ పధకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పదో తరగతి, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. వివిధ కారణాలతో సకాలంలో ఫీజు చెల్లించని విద్యార్ధుల అభ్యర్ధన మేరకు ప్రభుత్వం కొత్తగా తత్కాల్ పథకం ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి ఈ నెల 31 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసి తెలియజేశారు. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్ధులు ఇప్పటి వరకూ ఫీజులు చెల్లించకుంటే ఇప్పుడు తత్కాల్ పథకం ద్వారా చెల్లించవచ్చు. 


తత్కాల్ పథకంలో..


తత్కాల్ పథకంలో భాగంగా ఇంటర్ విద్యార్ధులు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31 వరకూ 3 వేల రూపాయల జరిమానాతో ఫీజులు చెల్లించవచ్చు. ఇదే చివరి గడువు, మరోసారి పొడిగించేది ఉండదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా పదో తరగతి విద్యార్ధులకు కూడా అవకాశం కల్పించింది. పదో తరగతి విద్యార్ధులకయితే డిసెంబర్ 27 నుంచి జనవరి 10 వరకు అవకాశముంటుంది. పదో తరగతి విద్యార్ధులు నిర్ణీత ఫీజుతో పాటు 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదైనా కారణంతో ఫీజు చెల్లించలేకుంటే ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. \


Also read: Pandem Kollu: సంక్రాంతికి పందెం కోళ్లను ఎలా ట్రైన్ చేస్తారో తెలుసా ఒక్కో, కోడి ధర 2 లక్షలు పందెం 25 లక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.