Pandem Kollu: సంక్రాంతి సంబరాలు మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. వందల కోట్లలో జరిగే పందేలు కావడంతో పందెం కోళ్లు మామూలుగా ఉండవు. బాడీ బిల్డింగ్ లేదా కుస్తీ పోటీల్లో దిగేటప్పడు ఎలా తర్ఫీదు పొందుతారో అచ్చం అలానే పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. పందేలు వందల కోట్లలో ఉంటే పందెం కోళ్లు ఎంత ధర పలుకుతుంటాయో తెలుసా..గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల పెంపకం కూడా ఓ వ్యాపారం మరి.
సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు, అతిధి మర్యాదలే కాదు.. కోస్తా జిల్లాల్లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు పెద్దఎత్తున ఉంటాయి. కోడి పందేల కోసం ప్రత్యేకంగా స్డేడియంలు నిర్మిస్తారు. ఎల్‌సిడీ స్క్రీన్లపై కోడి పందేలను చూపిస్తారు. ఫ్లడ్ లైడ్ వెలుతురులో రాత్రులు కూడా యధావిధిగా కొనసాగుతాయి. పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకున్నా కోడి పందేలు ఆగవు.
పెందెం కోళ్ల ధర ఎంత, శిక్షణ ఎలా ఉంటుంది
కోడి పందేలకు సిద్ధమయ్యే కోళ్ల ధర కనీసం 20 వేల నుంచి ప్రారంభమై 2 లక్షల వరకూ ఉంటుంది. ఇది కేవలం కోడి పుంజు ఖరీదు మాత్రమే. పందెం కోళ్లలో చాలా రకాలుంటాయి. కాకి, సేతు, పర్ల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, పూర, నల్లబొర ఇంకా ఇతర రకాలున్నాయి. జాతిని బట్టి రంగును బట్టి ధర ఉంటుంది. సంక్రాంతి 6-8 నెలల ముందు నుంచే వీటికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. తిండికే చాలా ఖర్చు పెడుతుంటారు. బాదం పప్పు, పిస్తా, అంజీర్, తేనె, మటన్ కీమా, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇలా మెనూ పెద్దదే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ మూడు పూటలా పెడతారు. స్నానం గోరు వెచ్చని నీటితో చేయిస్తారు. చిన్న చిన్న కొలనులు ఏర్పాటు చేసి ఈత కొట్టిస్తూ ట్రైనింగ్ ఇస్తారు. ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఆయిల్‌తో కోళ్లకు మసాజ్ చేస్తారు. కోళ్లు యాక్టివ్‌గా ఉండేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందంటారు.
కేవలం రెండు ఉభయ గోదావరి జిల్లాల్లోనే సంక్రాంతికి 300-500 బరులు సిద్ధమౌతాయి. రాజమండ్రి, కాకినాడ, రాజానగరం, కాట్రేనికోన, అమలాపురం, రాజోలు, రావులపాలెం, సఖినేటిపల్లి, అంబాజీపేట, కొత్తపేట, మలికిపురం, నర్శాపురం, భీమవరం, పాలకొల్లు, వీరవాసరం, తణుకు, ఏలూరు, భీమడోలు ఇలా అన్ని ప్రాంతాల్లో భారీగా కోడి పందేలు కోట్ల రూపాయల టర్నోవర్‌తో జరుగుతుంటాయి. బరిని బట్టి 1 లక్ష నుంచి 25 లక్షల వరకూ ఒక్కొక్క కోడి పందెం జరుగుతుంది.
కోడిపందేలకు ఓ శాస్త్రం
కోడి పందేలపై ఓ శాస్త్రం కూడా ఉంది. అదే కుక్కుట శాస్త్రం. అంటే ఏ జాతి పుంజుపై పందెం కాయాలి, ఏ కోడిని ఏ కోడిపై పందేనికి సిద్ధం చేయవచ్చనే వివరాలు ఇందులో క్షుణ్ణంగా ఉంటాయి. ఏ జాములో అంటే ఏ సమయంలో ఏ పుంజుపై పందెం వేస్తే గెలవగలరో కుక్కుటశాస్త్రంలో ఉంటుంది. తిధి, నక్షత్రం, వేళను బట్టి ఏ కోడిని పందేనికి సిద్ధం చేయాలో ఈ శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు చాలామంది.
Also read: Rain Alert: బలపడిన అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.