కరోనా వైరస్ ( coronavirus )  కారణంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించే పరిస్తితి లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ( Ap chief secretary neelam sahni ) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( SEC Nimmagadda Ramesh kumar ) కు నివేదిక సమర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body Elections ) నిర్వహణకు సంబంధించిన ప్రదాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అఖిలపక్ష భేటీ నిర్వహించి పార్టీల అభిప్రాయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బేటీ పిలవడంపై ఆగ్రహించిన అధికారపార్టీ వైసీపీ ( ycp ) భేటీకు దూరంగా ఉంది.  అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎస్ఈసీ కోరడంతో..ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆయనను కలిసి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారని, ఇటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు తెలిపారు. ఈ భేటీలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.


కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోందని.. దేశంలోనే అత్యత్తమంగా ఏపీ ప్రభుత్వం ( Ap Government ) పనిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో కరోనా వైరస్ ను నియంత్రిస్తున్నా.. పరిస్థితి  పూర్తిగా అదుపులో రాలేదన్నారు. 11వేలకు పైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని.. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఇతర ఉద్యోగులకు సైతం కరోనా వైరస్ సోకిందని చెప్పారు. పరిస్థితి అదుపులో రాగానే సమాచారం అందిస్తామని నివేదికలో స్పష్టం చేసింది ప్రభుత్వం. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( SEC Nimmagadda Ramesh kumar ) విడివిడిగా సమావేశమై..అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ భేటీలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అభిప్రాయం వెల్లడైంది. సీపీఎం, సీపీఐలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన ిసూచించగా..బీజేపీ, బీఎస్పీలు తాజాగా నోటిఫికేషన్ వెలువరించాలని కోరాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధమేనని స్పష్టం చేసింది.


Also read: AP: పశ్చిమ గోదావరి జిల్లా వాగులో ఘోర ప్రమాదం, ఆరుగురు విద్యార్దులు మృతి