ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) పశ్చిమ గోదావరి జిల్లా ( West Godavari district ) లో జరిగిన వాగు ప్రమాదం ( Canal Accident ) లో ఆరుగురు విద్యార్ధులు మృతి చెందారు. సంతర్పణ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వసంతవాడ వాడ వాగులో దిగి ఆరుగురు విద్యార్థులు మృత్యువాత ( 6 students died in canal accident ) పడ్డారు. దసరా ఉత్సవాల సందర్భంగా భూదేవిపేట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. మరుసటి రోజు సంతర్పణ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకల అనంతరం వసంతవాడ వాగు వద్ద వన సంతర్పణ ఏర్పాటు చేసుకున్న క్రమంలో..వాగు దాటి వచ్చే క్రమంలో ప్రవాహంలో మునిగిపోయారు. అప్పటి వరకు నీళ్లలో ఆడుతున్నవారిలో ఒకరు మునిగిపోతుండగా..కాపాడే ప్రయత్నంలో అందరూ కొట్టుకుపోయారు. విహారానికి వచ్చి మృత్యువాత పడటం విచారకరమని, మృతుల కుటుంబాలన్నీ నిరుపేదలని..అన్ని విధాలా ఆదుకుంటామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు.
మరోవైపు ఈ సంఘటనపై ప్రభుత్వం ( Ap Government ) స్పందించింది. ఈ విషాద సంఘటనను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) దృష్టికి తీసుకెళ్లగా..ఒక్కో మృతుని కుటుంబానికి 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
మృతులందరిదీ ఒకే ఊరు. ఒకే వీధి. అందరూ దాదాపు ఒకే వయసు పిల్లలు. ఒకరు తొమ్మిదో తరగతి, ఒకరు పది , మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మృతుల్లో గంగాధర వెంకటరావు, కర్నాటి రంజిత్, గొట్టి పర్తి మనోజ్, కునారపు రాధాకృష్ణ (16), కెల్లా భువన్ (18), శ్రీరాముల శివాజీ (18) ఉన్నారు. Also read: AP: ముగిసిన ఎస్ఈసీ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు